అరే.. చెయ్యిజారి పాయె: కాంగ్రెస్ నేతల అంతర్మథనం

telangana-congress-leaders-thought-that-they-miss-mp-chance
  • లోక్ సభకు పోటీ చేసి ఉండాల్సిందన్న భావనలో పలువురు కాంగ్రెస్ నేతలు
  • మూడు సీట్లలో గెలుపు..మరో 8 సీట్లలో రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు
  • తాము బరిలో ఉంటే గెలిచేవాళ్లమన్న అంచనాలు
  • పార్టీ బలపడటంతో అంతర్మథనం
  • ఈసారి ఏ చాన్సొచ్చినా మిస్ చేసుకోవద్దన్న ఆలోచన

ఆరు నెలల కిం ద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసేందుకు కాం గ్రెస్‌ నేతలు పోటీ పడ్డారు. టికెట్ల కోసం అప్లికేషన్ల మీద అప్లికేషన్లు పెట్టుకున్నారు.గాంధీభవన్‌ చుట్టూ చక్కర్లు కొట్టారు. కానీ రిజల్ట్‌ వచ్చిన తర్వాత అంతా డీలా పడ్డారు. టీఆర్‌ఎస్‌ హవాను ఎదుర్కోలేమని డిసైడయ్యారు. దాంతో లోక్ సభ ఎన్ని కల్లో పోటీ చేసేందుకు సీనియర్ నేతలు కూడా ఆసక్తి చూపలేదు. పోటీ చెయ్యాలని అడిగితే , ఏదో కారణం చెప్పి తప్పించుకున్నా రు.కానీ లోక్ సభ రిజల్ట్స్ చూసి ‘అరే.. చాన్స్‌ పోగొట్టుకుంటిమి.. పోటీ చేసుంటే గెలిచేటోళ్లం కదా’అని మథనపడుతున్నా రు. కాం గ్రెస్ మూడు ఎంపీసీట్లే గెలుచుకున్నా , మరో మూడు చోట్ల చాలా టఫ్ ఫైట్ ఇచ్చిం ది. ఇంకో ఐదు చోట్ల రెం డో స్థానంలో నిలిచిం ది. దీంతో కొన్ని సెగ్మెంట్లలో‘పోటీ చేసిన క్యాండిడేట్‌ కంటె  నేనే బలమైనోన్ని కదా. కచ్చితంగ గెలుద్దును కదా..’అనుకుంట లెక్కలు వేసుకుంటున్నా రు. పార్టీ బలపడ్డదని, మళ్లీ ఏదైనా చాన్స్‌ దొరికితే విడిచి పెట్టొద్దని భావి-స్తున్నా రు.

అసెంబ్లీ దెబ్బతో..

గతేడాది డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్‌ 19 స్థానాల్లోనే గెలిచిం ది. అందులోనూ 11 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ లో చేరుతామని ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ లో ఉత్సాహం తగ్గిపోయింది. ఆ పార్టీ తరఫున దేనికి పోటీ చేసినా దండుగేనని, పొరపాటున ఉత్సాహపడితే దాచుకున్నంతా ఊడ్చిపెట్టుకుపోవడం ఖాయమనే వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లోనే వినిపించాయి. ఆ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి ఎవరూ ఉత్సాహం చూపలేదు. పోటీకి అప్లికేష న్ పెట్టుకొమ్మంటే  చాలా మంది దూరంగా ఉండి పోయారు. కొందరు సీనియర్లూ వెనుకాడారు. దాంతో కాం గ్రెస్ పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపాల్సి వచ్చింది.వారిలోనూ కొందరు హైకమాండ్ ఆదేశించడంతో.. బలవంతంగానే పోటీకి దిగారన్న అభిప్రాయముంది. ఏదేమైనా ఒకటి రెండు సీట్లకు మించి రావనే పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కొందరు నేతలు గట్టిగానే ప్రయత్నిం చారు. టీఆర్ఎస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత వారికి కలిసి వచ్చింది. మొత్తంగా రిజల్ట్స్ ను చూశాక పార్టీలో తిరిగి జోష్ వచ్చిం ది.

నల్గొండ, భువనగిరి , మల్కా జ్ గిరి సీట్లలో గెలిచిన కాం గ్రెస్‌ 8 నియోజక వర్గాల్లో రెండో స్థానంలో నిలిచింది. అందులో చేవెళ్ల, జహీరాబాద్ లలో ఉత్కంఠ భరితమైన పోటీ ఇచ్చింది. జహీరాబాద్ లో కేవలం 6,229 ఓట్ల  తేడాతో ఓడిపోయింది. చేవెళ్లలో అయితే కాంగ్రెస్‌ జోరు చూసి విజయం ఖాయమనుకున్నా రు. కానీ చివరికి 14,317 ఓట్ల  తేడాతో ఓటమి ఎదురైంది. మిగతా స్థానాల్లోనూ గణనీయంగానే ఓట్లు సాధించింది. ఈ రిజల్ట్స్ చూసిన కొందరు సీనియర్లు తాము పోటీ చేసి ఉంటే, గెలిచి ఉండేవాళ్లమని లెక్కలేసుకుంటున్నా రు.

 

  • కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరిని నాగర్ కర్నూల్‌ నుంచి పోటీ చేయాలని ఆయన అనుచరులు అప్పట్లో బాగా ఒత్తిడి చేశారు. కానీ ఆ నేత ఆసక్తి చూపలేదు. ఫలితాలు చూశాక తానైతే గట్టి పోటీ ఇచ్చి, గెలిచే వాడినని అంటున్నా రు.
  • మరో సీనియర్‌ నేతకు నల్గొండ నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా తిరస్కరిం చారు.అసెంబ్లీ ఫలితాలతో హర్ట్‌ అయిన ఆయన పోటీకి ససేమిరా అన్నారు. కానీ ఇప్పుడా స్థానం కాంగ్రెస్‌ ఖాతాలో పడడంతో ‘పోటీ చేసి ఉంటే అయిపోయేది’ అని బాధపడుతున్నట్టు సమాచారం.
  • హైదరాబాద్ లోని ఒక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన యువ నేత తొలుత లోక్ సభకు పోటీ చేయాలని భావిం చారు. కానీ అసెంబ్లీ ఎన్ని కల్లో కాంగ్రెస్‌ రాణిస్తుందని నమ్మి ఆలోచన మార్చుకున్నా రు. అసెంబ్లీ ఎన్ని కల్లో ఓడిపోయారు. తర్వాత లోక్ సభకు పోటీ చేస్తారా అని అడిగినా వెనక్కి తగ్గా రు. అయితే ఆయన పోటీ చేయాలని భావించిన భువనగిరి లోక్ సభ సెగ్మెంట్ కాం గ్రెస్‌ కైవసం కావడంతో..నాలుక కర్చుకున్నారు.
  • ఇక జేఏసీల నుంచి వచ్చిన మరో ఇద్దరు నేతలు లోక్ సభ పోటీకి ఉత్సాహం చూపారు. కానీ వారికి టికెట్‌ దక్కలేదు. అసెంబ్లీ ఫలితాలను మనసులో పెట్టుకుని,టికెట్‌ రాకపోయినా పర్లేదులే అనుకున్నారు. గట్టి ప్రయత్నం కూడా చేయలేదు.అయితే వారు టికెట్‌ ఆశించిన రెండు ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలిచింది.తాము బరిలో ఉంటే గెలిచే వాళ్లమని ఇప్పుడు తలపట్టుకున్నా రు.
  • వీరే కాదు మరికొందరు నేతలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నా రు. పార్టీ తిరిగి బలపడుతోందని, భవిష్యత్ లో ఏ చాన్స్ వచ్చినా వదులుకోవద్దని భావిస్తున్నారు.

Latest Updates