ఈ నెల 13న కాంగ్రెస్ నేత‌ల గోదావరి జల దీక్ష

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల చూపుతున్న నిర్ల‌క్ష్యాన్ని ప్రజలకు చెబుతామంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు. గోదావరి నది పైన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఈ నెల 13వ తేదీన సందర్శించి వాటి పురోగతిని సమీక్షించి ప్రజలకు వివరించనున్నారు. ఈ విషయంపై పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నాయకులతో, ఎంపీ, ఎమ్యెల్యే లతో ఫోన్ ద్వారా చర్చించారు. 13వ తేదీన గోదావరి నది పైన ఉన్న ప్రాజెక్టులను సందర్శించి అక్కడ స్థానిక మీడియా తో ప్రాజెక్టు స్వరూపం గురించి మాట్లాడాలని పార్టీ నేతలకు సూచించారు. గోదావ‌రి జ‌ల దీక్ష‌కు కాంగ్రెస్ నేత‌ల‌కు పిలుపునిచ్చారు.

ప్రాజెక్టులు – వాటిని సందర్శించే నేతలు

ఈ సంద‌ర్భంగా ప్రాణహిత ప్రాజెక్టు స్థలం ఆదిలాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ఎమ్యెల్సి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శశిధర్ రెడ్డి, గౌరవల్లి రిజర్వాయర్ వద్ద ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లు ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌నున్నారు.

దేవాదుల ప్రాజెక్టు వద్ద ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్యెల్యే సీతక్క, దుమ్ముగూడెం ప్రాజెక్టు వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్యెల్యే పొడెం వీరయ్య, మాజీ ఎంపీ వి .హనుమంతరావు, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాములు నాయక్, ఎల్లం పల్లి వద్ద కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, ఏఐసిసి సెక్రెటరీ వంశీ చంద్ లు దీక్ష‌లో పాల్గొన‌నున్నారు.‌

.అలిసాగర్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, కామారెడ్డి సమీపంలో ప్రాణహిత 22వ ప్యాకేజీ భూంపల్లి వద్ద మాజీ మండలి విపక్ష నేత షబ్బీర్ అలీ పాల్గొంటారు.

Telangana Congress leaders to visit Godavari irrigation projects on this month 13

Latest Updates