కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం మొదలు.. జోగులాంబ గుడిలో పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా : కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఉదయం పది గంటలకు… అలంపూర్‌ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ నేతలు… అక్కడి నుంచి వాహనాల్లో ర్యాలీగా బయల్దేరి ప్రచారాన్ని ప్రారంభించారు. ఉదయం బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయల్దేరి… అలంపూర్ చేరుకున్న కాంగ్రెస్ నేతలు…. జోగులాంబ ఆలయంలో పూజలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ రామచంద్ర కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్,  ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, క్యాంపెయినర్ కో-కమిటీ చైర్మన్ డీ.కే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి, సంపత్ కుమార్ సహా.. కాంగ్రెస్ లీడర్స్ పాల్గొన్నారు.

తర్వాత ఊరూరా రోడ్డుషోలు మొదలుపెట్టారు కాంగ్రెస్ నాయకులు. ప్రచారంలో భాగంగా అలంపూర్‌, ఐజ, శాంతినగర్‌ లలో రోడ్డు షోల్లో పాల్గొంటారు. గ్రామ కూడళ్లలో జనంతో మాట్లాడతారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో  రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామన్నారు నేతలు. సాయంత్రం గద్వాలలోని జమ్ములమ్మ గుడి దర్శించుకొని Y.S.రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర సభ నిర్వహిస్తారు.

Posted in Uncategorized

Latest Updates