రాష్ట్రంలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు.. హైదరాబాద్‌లోనే దాదాపు వెయ్యి

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ భారీగా క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 1213 కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఈ కేసుల్లో ఒక్క గ్రేట‌ర్‌ హైద‌రాబాద్‌లోనే దాదాపు వెయ్యి మంది ఉన్నారు. తాజా కేసుల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 18,570కి చేరింది. అలాగే ఒక్క రోజులో ఎనిమిది మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 275కి పెరిగింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 987 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 9069కి చేరింది. ప్ర‌స్తుతం 9226 మంది చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో అత్య‌ధికంగా ‌గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 998 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మేడ్చ‌ల్‌లో 54 మందికి, రంగారెడ్డి జిల్లాలో 48 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది.

Latest Updates