ట్రంప్ కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న భక్తుడు

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామానికి చెంది నబస్సా కృష్ణ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుకలుసుకునేందుకు ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాడు . గ్రామంలోని ఇంటి వద్ద ఏకంగా ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు చేస్తున్నాడు . మంగళవారం కృష్ణ మాట్లాడు తూ ట్రంప్ ఈ నెల 24న భారత పర్యటనలోభాగంగా గుజరాత్ కు వస్తున్న నేపథ్యంలో ఆయన నుంచి తనకు పిలుపు వస్తుందనిధీమా వ్యక్తం చేస్తున్నాడు . ఇండియాకు వచ్చినప్పుడు తనను కలుస్తానని 2019 జూన్14న ట్విట్టర్ లో ట్రంప్ పేర్కొన్నారని అంటున్నారు. ట్రంపు తనకు దేవుడులాంటి వాడని,అందుకే ఆయన పుట్టిన రోజున విగ్రహం ఏర్పాటు చేసిన పూజలు, అభిషేకాలు చేస్తూప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నట్లు వివరించాడు. తనను కలిసినా, కలవకపోయినా ఆయన విగ్రహానికి నిత్య పూజలు చేస్తూనే ఉంటానని తెలిపాడు.

Latest Updates