తెలంగాణ‌ ఎంసెట్-2020 ‘కీ’ విడుదల

జేఎన్టీయూ: రాష్ట్రంలో నిర్వ‌హించిన తెలంగాణ‌ ఎంసెట్ కీ విడుదల చేశారు ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్. శుక్ర‌వారం నుండి ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు ఎంసెట్ వెబ్ సైట్ లో కీ అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 9,10,11,14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకి ఏపీ, తెలంగాణ నుంచి 1లక్ష 19వేల 187 మంది విద్యార్థులు హాజరయ్యారు.

కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ… మొత్తం ఎనిమిది ప్రశ్నపత్రాలకు సంబంధించిన ప్రాథమిక కీతోపాటు విద్యార్థుల ఓఎంఆర్‌ పేపర్ స్కానింగ్‌ కాపీలనూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అన్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీ తుది కీను నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. దాని ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తామని అన్నారు. అభ్యర్థులు వివరాలను https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చని ఆయన అన్నారు.

Latest Updates