తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..75.29 ఉత్తీర్ణత శాతం నమోదు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి,ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్.. ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ లు విడుదల చేశారు.    సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో నిర్వహించిన ఎంసెంట్ పరీక్షల్లో 1,43 326 మంది అప్లై చేసుకోగా అందులో 1,19 183 మంది హాజరయ్యాయి. అయితే తాజాగా విడుదలైన ఈ పరీక్షా ఫలితాల్లో 89వేల 734 మంది ఉత్తీర్ణతతో  75.29 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్థులకు ఈ నెల 8న ఎల్బీనగర్ ఐఆన్ సెంటర్ లో పరీక్ష నిర్వహించనున్నారని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి.

ఇంజనీరింగ్ టాపర్స్
1.సాయి తేజ వారణాసి.
2. యశ్వంత్ సాయి
3.తమ్మన బోయిన మణి వెంకట కృష్ణ
4.చాగలి కౌశల్ కుమార్ రెడ్డి
5.అద్రిక్ రాజ్ పాల్
6.నాగేలి నితిన్ సాయి
7.తవ్వ కృష్ణ కమల్
8.అన్నం సాయి వర్ధన్
9. ఎనగా మూరి సాయి హర్ష వర్ధన్
10. వారణాసి వచన్ సిద్దార్థ్

Latest Updates