నేడు కలెక్టరేట్ల వద్ద ఉద్యోగుల నిరసన

హైదరాబాద్, వెలుగు:ఎంప్లాయీస్‌‌కు వెంటనే పీఆర్సీ, బకాయిపడ్డ రెండు డీఏలు ఇయ్యాలని డిమాండ్​ చేస్తూ సోమవారం కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టనున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఈఏ) ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఈఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంపత్ కుమారస్వామి, పురుషోత్తమ్‌‌ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. సీపీఎస్ రద్దు చేసి, పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసనల్లో ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ (పీటీఐ)లను కొనసాగించాలని కోరుతూ సోమవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు పీటీఐల సంఘం రాష్ట్ర ప్రతినిధి కృష్ణహరి తెలిపారు.

Latest Updates