రూ. 2,455 కోట్ల మందు తాగేసిండ్రు

  • ఆబ్కారీ శాఖకు ఫుల్లుగా ఎలక్షన్ కలెక్షన్
  • గత ఏడాదితో పోలిస్తే రూ. 490 కోట్ల అదనపు ఆదాయం
  • బీర్ల కంటే ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఎక్కువ గిరాకీ
  • ఊళ్లల్లో జోరుగా బెల్టుషాపుల దందా
  • రాష్ట్రంలో ఏప్రిల్​ 1 నుంచి మే 13 వరకు లెక్క ఇది

రాష్ట్ర ఆబ్కారీ శాఖకు ఎలక్షన్​ సీజన్ కలెక్షన్ల వర్షం కురిపించింది. మద్యం అమ్మకాలతో రూ. 490 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గల్లీ గల్లీలో మందుకు ఫుల్​ గిరాకీ కనిపించింది. బెల్టు షాపులతో కొందరు మస్తు పైసలు సంపాదించుకున్నారు. గతేడాది ఏప్రిల్​లో  రూ. 1371.68 కోట్ల మద్యం అమ్మకాలు జరుగగా.. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 1714.34  కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది మే 1 నుంచి 13 వరకు రూ. 597.42 కోట్ల అమ్మకాలు జరుగగా.. ఈ ఏడాది మే 1 నుంచి 13 వరకు రూ. 740.85 కోట్ల అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే  సుమారు 25 శాతం వృద్ధి కనిపించింది. మొత్తంగా మద్యం అమ్మకాలతో ఆబ్కారీ శాఖకు ఈ  ఏడాది ఏప్రిల్​ 1 నుంచి మే 13 వరకు రూ. 2,455.19 కోట్ల ఆదాయం సమకూరగా.. ఇదే సమయంలో గతేడాది రూ. 1,969.10 కోట్లు వచ్చాయి.

బీర్ల కంటే ఐఎంఎల్​కే గిరాకీ

రాష్ట్రంలో మందు బాబులు బీర్ల కంటే ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫారిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ను తాగేందుకు ఎక్కువగా మొగ్గు చూపారు. వాస్తవానికి ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ఈసారి ఐఎంల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమ్మకాల జోరే ఎక్కువగా కనిపించింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 48,93,238 కేసుల బీర్లు అమ్ముడవగా, గతేడాది ఏప్రిల్​లో 47,09,635 కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. అంటే 4 శాతం మాత్రమే ఎక్కువగా బీర్లు అమ్ముడుపోయాయి. ఇక ఈ ఏడాది మే 1 నుంచి 13 వరకు 22,51,803 కేసుల బీర్ల అమ్ముడుపోగా.. గతేడాది మే 1 నుంచి 13 వరకు 23,01,077 కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ 13 రోజులను బట్టి చూస్తే గతేడాదే ఎక్కువగా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఐఎంఎల్ విషయానికొస్తే ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 26,43,915  కేసులు అమ్ముడు కాగా,  గతేడాది ఏప్రిల్​లో 20,46,065 కేసులు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది మే 1 నుంచి 13 వరకు 11,15,795 ఐఎంఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసులు అమ్ముడుపోగా.. ఇదే సమయానికి గతేడాది 8,58,609 కేసులను మాత్రమే అమ్మారు.

 ఎలక్షన్​ కలెక్షన్​

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జనవరి నెలల్లో జరిగిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల పుణ్యమాని మద్యం అమ్మకాలతో సుమారు  రూ. 800 కోట్ల వరకు అదనపు ఆదాయం ఆబ్కారీ శాఖకు సమకూరింది. రాష్ట్రంలో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలు జరగ్గా, అదే నెల 20న పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విడుదలైంది. మూడు విడతలుగా ఈ నెల 6, 10, 14 తేదీల్లో పరిషత్​ ఎన్ని కలు నిర్వహించా రు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నా.. కొందరు నాయకులు ఓట్ల కోసం ఊళ్లల్లో మద్యాన్ని ఏరులై పారించారు. చాలా
ఊళ్లల్లో సాయంత్రం కాగానే దావత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేసుకోవడం కనిపించింది. పోలిం గ్ ముందు రోజు పెద్ద మొత్తంలో లిక్కర్​ పంపి ణీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 1 నుంచి మే 13 వరకు రూ. 490 కోట్ల మేరకు అదనపు ఆదాయం ఆబ్కారీ శాఖకు సమకూరింది.

జోరుగా బెల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాపులు

ఎన్ని కల నేపథ్యంలో పల్లెల్లో బెల్టు షాపుల్లోఫుల్లు దందా నడిచింది. బార్ల మాదిరిగానే ఊళ్లల్లోనూ ప్రత్యే క గదులు ఏర్పాటు చేసి ఇష్టారీతిన బెల్టు షాపులు నడిపించారు. కూలర్‌ , ఫ్రిజ్‌ , కుర్చీలు , బెం చీలు.. ఇలా అన్ని రకాల సదు-పాయాలతో బహిరంగంగానే మందు అమ్ముకున్నారు. ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.30నుంచి 50 వరకు దండుకున్నారు.

Latest Updates