సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర అవతరణ వేడుకలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా జూన్ 2న ట్యాంక్ బండ్ పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి చెప్పా రు. 3న ఎల్బీ స్టేడియంలో 1,001 మంది కళాకారులతో పేరిణి మహానృత్య ప్రదర్శన, 4న ఐదు వేల మంది కళాకారులతో ఒగ్గు డోలు మహా విన్యాసం నిర్వహిస్తా మన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకలపై గురువారం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణవేడుకలను పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించేందుకు పకడ్బం దీ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులనుఆదేశించారు. “బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యు లేషన్ పైపోలీసు అధికారులు దృష్టి పెట్టా లి. వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి సమాచార శాఖ ఏర్పాట్లు చేయాలి. రాజ్ భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంక-
రించాలి. పరేడ్ గ్రౌండ్స్ లో పరిశుభ్రత, మొబైల్  టాయిలెట్లు, నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా,అంబులెన్సులు, డాక్టర్ల టీంలు, బారికేడింగ్, ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలి. పుష్పాలంకరణ పనులు చేపట్టాలి” అని ఆదేశించారు. వేడుకల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి వెయ్యి మంది విద్యార్థు లు పాల్గొంటారని చెప్పా రు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా పిపుల్స్ ప్లాజా, రవీంద్రభారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎస్.కె. జోషి వివరించారు.

Latest Updates