తొలి విడత ముగిసిన పరిషత్ పోల్

telangana-first phase parishath-elections-completed

తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత పరిషత్ ఎన్నికలు ముగిశాయి. ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది. మావో ప్రభావిత ఐదు జిల్లాలలైన ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, భద్రాద్రి, మంచిర్యాలలో మొత్తం 75 జెడ్పిటీసీ, 640 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 4 గంటల వరకు సాగిన ఓటింగ్ లో 70 శాతం పోలింగ్ నమోదైంది. సమయం ముగిసినా క్యూలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం ఉంది.

Latest Updates