తింటే తెలంగాణ చేపలే తినాలి

తింటే తెలంగాణ చేపలే తినాలి

చేపలు తినాలని  అందరికీ ఉంటది.. కానీ అవి అంతటా అందుబాటులో లేవన్నారు మంత్రి హరీశ్ రావు.HMDA గ్రౌండ్‌లోGHMC, 29 జిల్లాల‌కు క‌లిపి 117 మొబైల్ చేపల వాహనాలను మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ క‌లిసి ప్రారంభించారు. హైరాబాద్ కేవలం 4 ,5 ఏరియాల్లో లలో మాత్రమే చేపలు దొరుకుతాయన్నారు. మత్స  పరిశ్రమ అంటే కొన సీమ పరిశ్రమ అన్నట్టు ఉండేదని..తెలంగాణ చేప అంటే మంచి నీటి చేప అన్నారు. ఇది చాల నాణ్యమైనది...ఆరోగ్యానికి మంచిది అన్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా ఫస్ట్ చెరువులు నింపాలి అని సీఎం కేసీఆర్ తెలిపారన్నారు. ఏడాది పొడవునా చెరువులు నీళ్లతో  నిండి ఉంటున్నాయన్నారు. మార్చి లో కూడా చెరువులు మత్తడి  దూకుతున్నాయన్నారు. చేప ఎంత ఈదితే  అంత పెరుగుతుందన్నారు. బంగారు తెలంగాణ అంటే అందరు హ్యాపీగా ఉండటమేనన్నారు.తెలంగాణ ప్రజలు ఎంత మంచివారో..తెలంగాణ చాపలు అంత మంచివన్నారు. రాష్ట్రంలో పింక్ రెవల్యూషన్  నడుస్తోందన్నారు. అన్ని టౌన్ లలో కూడా నాన్ వెజ్  మార్కెట్లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని...ప్రతి పట్టణం లో కూడా చేపల మార్కెట్ ఉండేలా చూస్తామన్నారు మంత్రి హరీశ్.మన రాష్ట్రం నుంచి  త్వరలోనే ఇతర ప్రాంతాలకు చేపల ఎగుమతి జరుగుతుందన్నారు.

సమైక్యరాష్ట్రంలో మత్స్య పరిశ్రమను నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సమైక్య రాష్ట్రంలో అర కొర నిధులు ఉండేవని..కేవలం ఫిషరీస్  డిపార్ట్మెంట్  కే సీఎం కేసీఆర్ 100 కోట్ల నిధులు ఇచ్చారన్నారు. చాపలు ఆరోగ్యానికి మంచిదని..అందరు డాక్టర్లు ఇదే చెప్తారన్నారు. మొబైల్ చేపల వాహనాలు మత్య్సకారులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.10 లక్షల రూపాయల వాహనాలను కేవలం 4 లక్షలకే  ఇస్తున్నామన్నారు. 6 లక్షల సబ్సిడీ కేవలం మహిళా పేర్ల మీద మాత్రమే వాహనాలు ఇస్తున్నామన్నారు.