లిటరసీలో తెలంగాణకు లాస్ట్ నుంచి నాలుగో స్థానం

రాష్ట్రంలో లిటరసీ 72.8

22 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానం

తొమ్మిదేండ్లలో పెరిగిన లిటరసీ 6.26 శాతమే

ఆడోళ్లు వెయ్యికి 984 మందే..

కేరళ టాప్, ఏపీ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఎన్ఎస్ఎస్​సర్వేలో తేలిన లెక్క

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ప్రతి వందలో 28 మందికి చదువు రాదని తేలింది. దేశంలో 77.7 శాతం అక్షరాస్యత ఉండగా, మనరాష్ట్రంలో యావరేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటే తక్కువగా 72.8 శాతమే ఉన్నట్టు ఇటీవల నిర్వహించిన నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాంపిల్ సర్వే (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)లో వెల్లడైంది. దీని ప్రకారం 22 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ కింది నుంచి నాలుగో స్థానంలో ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అక్షరాస్యత 66.54 శాతం. అంటే తొమ్మిదేండ్లలో కేవలం 6.26 పెరిగిందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్​​అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ నేషనల్ శాంపుల్ సర్వేను దేశవ్యాప్తంగా జులై 2017 నుంచి జూన్​2018 వరకూ నిర్వహించారు. ఇందులో తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో 1,916 ఫ్యామిలీలను, అర్బన్ ప్రాంతాల్లో 1,726 ఫ్యామిలీలను శాంపిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుని సర్వే చేశారు. అక్షరాస్యత, ఉచిత విద్య, డ్రాపౌట్స్, లింగనిష్పత్తి, హైయ్యర్ ఎడ్యుకేషన్.. ఇలా అంశాల వారీగా మూడేండ్ల నుంచి 35 ఏండ్లలోపు వారి వివరాలు సేకరించారు.

కేరళ టాప్, ఏపీ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అక్షరాస్యతలో 22 పెద్ద రాష్ట్రాల్లో కేరళ 96.2 శాతంతో టాప్​లో ఉండగా కేవలం 66.4 శాతంతో ఏపీ చివరి స్థానంలో ఉంది. చివరి నుంచి రెండో స్థానంలో రాజస్థాన్​(69.7శాతం), మూడో స్థానంలో బీహార్(70.9శాతం) ఉన్నాయి. మన రాష్ట్రంలో మగవాళ్ల కంటే ఉమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్షరాస్యత ఐదు శాతం తక్కువ. గ్రామీణ​ ప్రాంతంలో లిట్రసీ 62.1శాతం ఉంటే, పట్టణాల్లో 85.5 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అక్షరాస్యత కేవలం 53.7 శాతమే. రాజస్థాన్ ఇది 52.6 శాతం.

డ్రాపౌట్స్ 9.5 శాతం

తెలంగాణలో డ్రాపౌట్స్​రేటు 9.5 శాతం ఉందని సర్వేలో తేలింది. దీంట్లో అమ్మాయిలు 10.3శాతం ఉంటే, అబ్బాయిలు శాతం 8.9గా నమోదైంది.

ఆడోళ్లు వెయ్యికి 984 మందే

రాష్ట్రంలో వెయ్యి మంది మగాళ్లు ఉంటే ఆడోళ్లు 984 మంది ఉన్నారు. దేశసరాసరి (927)తో పోలిస్తే కాస్త బెటరే. ఇక తమిళనాడు (1,014 మంది ఆడోళ్లు), కేరళ(1,048), హిమాచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రదేశ్(1,030), ఏపీ(1,003) రాష్ట్రాల్లో మాత్రం మగాళ్ల కంటే ఆడోళ్లే ఎక్కువ ఉన్నారు.

Latest Updates