నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు

telangana-government-announced-gurukula-teachers-recruitment

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఓ శుభవార్తను తెలిపింది. బీసీ గురుకులాల్లో 1698 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఇందులో టీజీటీ పోస్టులు 1071, పీఈటీ 119తో పాటు.. 36 ప్రిన్సిపల్‌ సహా ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ ఆదేశించింది. ఈ ఆదేశాలపై ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.

Latest Updates