తెలంగాణ నుంచి ఏపీ, మహారాష్ట్రలకు వెళ్లడంపై నిషేధం

కరోనా వైరస్ ను అరికట్టడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం విధించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అయ్యాయి. ఇప్పటికే అక్కడ కరోనా కేసుల సంఖ్య పదివేలకు పైగా దాటింది. మరో వైపు ఏపీ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వము కీలక నిర్ణయము తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు ప్రజలు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు సరిహద్దుల దగ్గర భారీగా పొలీసు బలగాలను మోహరింపజేసింది ప్రభుత్వం.

Latest Updates