టెస్టులకు పోటెత్తిన జనం.. ఆస్పత్రుల్లో శాంపిల్స్‌ సేకరణ షురూ

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్‌‌హైదరాబాద్ పరిధిలో కరోనా పరీక్షలు ప్రారంభమయ్యా యి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సిటీలోని పలు ఏరియా, జిల్లా ఆస్పత్రులలో శాంపి ళ్లు తీసుకోవడం స్టార్ట్‌‌ చేశారు. గోల్కొండ, నాం పల్లి, మలక్‌‌పేట్‌‌, మల్కాజ్‌‌గిరి, వనస్థ లిపురం, సూరజ్‌‌ఖాన్‌‌, బార్కాస్‌‌ ఏరియా హాస్పిటళ్లు, రామాంతపూర్‌‌హోమియో హా స్పిటల్‌‌, కూకట్‌‌పల్లి అర్బన్‌‌హెల్త్‌‌ సెంటర్‌‌ల లో మంగళవారం శాంపి ళ్లుతీసుకున్నారు. ఏరియా హాస్పిటళ్లు, ఆరోగ్య కేంద్రాలు, జిల్లా హాస్పిటళ్లలో  రోజుకు 2,500 శాంపిళ్లుతీసు కోవడం లక్ష్యంగా పని చేస్తున్నారు. ప్రైమరీ కాంటాక్ట్,  ‌ లక్షణాలున్న వాళ్లకు తొలుత పరీక్షలు చేయనున్నారు. సరోజిని దేవి కంటి హాస్పిటల్‌‌లో నిర్వహించిన మెగా క్యాంప్‌‌ కు తొలి రోజు భారీగా జనం వచ్చారు. డాక్టర్‌‌ కన్సల్టేషన్‌‌,శాంపిళ్ల సేకరణ తర్వాత వివరా లను ఆన్‌‌లైన్‌‌లో అప్‌‌లోడ్‌‌చేస్తున్నారు.

Latest Updates