దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సిట్

దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్ కౌంటర్ పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మందితోస్పెష ల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్ )ను ఏర్పాటుచేసింది . దీని కి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ నాయకత్వం వహించనున్నారు.వనపర్తి ఎస్పీ అపూర్వారావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ పి. శ్రీధర్ రెడ్డి,రాచకొండ ఐటీ సెల్ అధికారి శ్రీధర్ రెడ్డి, కొరటాలసీఐ రాజశేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్ బీ ఇన్స్పె క్టర్ వేణుగోపాల్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్ కౌంటర్పై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జీవో విడుదల చేసింది . దర్యాప్తును పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలని సిట్ కు ఆదేశించింది.

Latest Updates