బార్లు, క్లబ్ లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కరోనా వ్యాప్తి కారణంగా తెలంగాణలోని బార్లు, క్లబ్ లను  మూసివేయాల‌ని ప్ర‌భుత్వం ఆరు నెల‌ల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బార్లు, క్ల‌బ్ లు తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం శుక్రవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  అయితే ప‌ర్మిట్ రూమ్‌ల‌కు మాత్రం  అనుమ‌తి ఇవ్వ‌లేదు. బార్లు, క్ల‌బ్బుల్లో  మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌ను నిషేధించింది. క‌రోనా నిబంధ‌న‌లు క‌చ్చితంగా పాటించాల‌ని… నిబంధ‌న‌లు పాటించ‌ని బార్లు, క్ల‌బ్ ల‌పై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది.

పాటించాల్సిన నిబంధ‌న‌లు:

..బార్లు, క్ల‌బ్ ల దగ్గర థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్‌లు ఏర్పాటు చేయాలి.

..క్ర‌మ‌ప‌ద్ధ‌తి పాటించాలి, ప‌రిశుభ్ర‌త‌కు అధిక ప్రాధాన్యం.

..పార్కింగ్ ఏరియాల్లో జ‌నాలు గుమిగూడ‌కుండా చూడాలి.

..శానిటైజ‌ర్ త‌ప్ప‌నిస‌రిగా అందుబాటులో ఉంచాలి.

..బార్లు, క్ల‌బ్ సిబ్బందితో పాటు మిగ‌తా వారు క‌చ్చితంగా మాస్కు ధ‌రించాలి.

..మ్యూజిక‌ల్ ఈవెంట్స్, డ్యాన్స్‌ల‌పై నిషేధం.

..ప్ర‌తి రోజు ఉద‌యం, సాయంత్రంతో బార్లలో సీట్లను శానిటైజ్ చేయాలి.

..వెంటిలేష‌న్ ఉండేలా చ‌ర్య‌లు.

Latest Updates