సచివాలయ నిర్మాణ టెండర్ల గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణానికి సంబంధించిన టెండర్ల దాఖలు గడువును పొడిగించింది. అక్టోబర్ 1వ తేదీతో ముగియాల్సిన టెండర్ల దాఖలు గడువును అక్టోబర్ 13వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు టెండర్లు స్వీకరించాలని అధికారులకు సూచించింది. దాదాపు రూ. 500 కోట్లతో సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి రోడ్లు- భవనాల శాఖ ఇప్పటికే టెండర్లు పిలిచింది. కాగా.. టెండర్ల దాఖలు గడువు పొడిగించడంతో.. నేడు జరగాల్సిన ప్రీబిడ్ సమావేశాన్ని కూడా వాయిదా వేశారు. దాంతో ప్రీబిడ్ సమావేశాన్ని వచ్చే నెల ఏడో తేదీన నిర్వహించాలని నిర్ణయించార. ఆ తర్వాత టెక్నికల్ బిడ్లను వచ్చే నెల 13వ తేదీన, ఆర్థిక బిడ్లను వచ్చే నెల 16వ తేదీన ఓపెన్ చేయాలని ఖరారు చేశారు.

For More News..

కూతురిపై 10 ఏళ్లుగా అత్యాచారం చేస్తున్న రైల్వే ఉద్యోగి.. 

దిశ ఘటనను అచ్చుగుద్దినట్లు దింపిన ఆర్జీవీ ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు

Latest Updates