తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీని ఆదర్శంగా తీసుకోవాలి: కిషన్ రెడ్డి

కరోనా వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్‌ను వేగంగా అమలు చేయాలని సూచించారు. కరోనా కట్టడి చేస్తున్న ఢిల్లీని తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో అందుతోన్న వైద్యం, వసతులను పరిశీలించిన కిషన్ రెడ్డి… టిమ్స్ లో వసతులను మరింత మెరుగుపర్చాల్సిన అవసరముందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కల్పించాల్సిన బాధ్యత సర్కారుదేనన్నారు. ఈ నెలలో ప్రజలు మరిన్ని జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కరోనా బారిన పడిన వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకోవాలని ఆయన చెప్పారు. దేశంతో పాటు రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. వైద్య సిబ్బందిని మరింత మందిని తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు కిషన్ రెడ్డి.

Latest Updates