క‌రోనా నుంచి రాష్ట్రాన్ని కాపాడండి : ప‌్రైవేట్ ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాల్ని కోరిన కేసీఆర్

తెలంగాణ‌లో అత్య‌ధిక ఛార్జీలు వ‌సూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ప్ర‌భుత్వం నిఘూ పెంచింది. క‌రోనా వైర‌స్ పెరుగుతున్న ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ఆసరగా తీసుకుంటున్న కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు క‌రోనా బాధితుల నుంచి పెద్ద మొత్తంలో ఛార్జీలు వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించింది. అత్య‌ధిక ఛార్జీలు వ‌సూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌పై తనిఖీలు చేసేందుకు టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

రోగుల నుండి వచ్చిన ఫిర్యాదులను గమనించి, తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇది ప్రైవేటు ఆసుపత్రులలో రోగులకు అధిక ఫీజులు వసూలు చేయకుండా చూసేందుకు సీనియర్ ఐఎఎస్ అధికారులను నియ‌మించింది.

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల‌ రాజేందర్ అధ్య‌క్ష‌త‌న టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని, వారం వారం నివేదికలను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) కు పంపుతామని సీఎం కేసీఆర్ ధృవీకరించారు.

ప్రస్తుత పరీక్షా సమయాల్లో డబ్బును వృదా చేయవద్దని, మహమ్మారి నుంచి రాష్ట్రం కోలుకోవడానికి సహాయం చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ ప్రైవేటు ఆసుపత్రి యాజ‌మాన్యాల‌ను కోరారు.

Latest Updates