ఇకపై క్వారంటైన్ 14 కాదు 28 రోజులు

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో కరోనా సస్పె క్టర్స్​ను ఇక నుంచి 28 రోజుల పాటు క్వారంటైన్‌‌లోనే ఉంచాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు అన్నిజిల్లాల కలెక్లర్లకు చీఫ్ సెక్రెటరీ సోమేశ్‌ కుమార్‌‌  ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పాజిటివ్వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్స్‌ట్ అందరినీ క్వారంటైన్‌‌ కు తరలించవద్దని.. కేవలం కరోనా పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్స్‌ట్ నుమాత్రమే సర్కారీ క్వారంటైన్ సెంటర్లకు తరలించాలని ఆదేశించారు. వారికి మాత్రమే టెస్టులు చేయించాలని, సెకండరీ కాంటాక్స్‌ట్ లో లక్షణాలు లేని వారికి టెస్టులు చేయించొద్దని స్పష్టం చేశారు. అయితే సెకండరీ కాంటాక్స్‌ అందరికీ స్టాంప్ వేసి..28 రోజుల పాటు ఇంట్లో నే క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఇండ్లకే వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించాలని సూచించారు.

లేటుగా లక్షణాలు తెలుస్తుండటంతో..ప్రస్తుతం కరోనా సస్పె క్టర్స్​ను 14 రోజులు మాత్రమే క్వారంటైన్‌‌ లో ఉంచుతున్నారు. వైరస్ సోకిన వాళ్లలో చాలా మందికి 2 నుంచి 14 రోజుల మధ్యలోనే లక్షణాలు బయటపడుతున్నాయి. అందువల్ల దేశవ్యాప్తంగా 14 రోజుల క్వారంటైన్ పీరియడ్‌‌ ను పాటిస్తున్నారు. కొందరికి మాత్రం 14 రోజుల తర్వాతే కరోనా లక్షణాలు బయటపడుతున్నా యి. మరోవైపుకరోనా పాజిటివ్ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్స్‌ వందల్లో ఉంటున్నాయి. ఇంతమందిని క్వారంటైన్‌‌ సెంటర్లకు తరలించి.. వాళ్లకు ఫుడ్, బెడ్‌‌  సౌకర్యాలు కల్పించడం ఇబ్బందిగా మారుతోంది. దీంతో సెకండరీ కాంటాక్ట్స్​లో లక్షణాలున్న వారికి మాత్రమే టెస్టులు చేయించి, లేనివారిని ఇంట్లోనే 28 రోజుల పాటు క్వారంటైన్‌‌ చేయాలని, దీనివల్ల ఇతరులకు వైరస్ వ్యాపించే అవకాశం ఉండదని అధికారులు చెప్తున్నా రు.

Latest Updates