తెలంగాణ గవర్నర్ అందరికన్నా చిన్న

ఏపీ గవర్నర్‌‌‌‌ పెద్దాయన

న్యూఢిల్లీ: మన రాష్ట్ర గవర్నర్‌‌‌‌గా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై సౌందరరాజన్‌‌‌‌కు అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలో అతి చిన్న వయసున్న గవర్నర్‌‌‌‌గా తమిళిసై  రికార్డుల్లో ఉన్నారు.  అందర్లోకి పెద్దాయన  మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ బిశ్వభూషణ్‌‌‌‌ హరిచందన్‌‌‌‌. తమిళిసై వయసు 58 ఏళ్లు కాగా,  హరిచందన్‌‌‌‌ వయసు 85 సంవత్సరాలు. హరిచందన్‌‌‌‌ తర్వాత ఎక్కువ  వయసున్న గవర్నర్‌‌‌‌ మధ్యప్రదేశ్‌‌‌‌ గవర్నర్‌‌‌‌ లాల్జి టాండన్‌‌‌‌ . ఆయన వయసు 84 ఏళ్లు. దేశంలో గవర్నర్ల యావరేజ్‌‌‌‌ వయసు 73 ఏళ్లుగా ఉంది. 60 లోపు వయసున్న ఒకే ఒక్క గవర్నర్‌‌‌‌ కూడా  తమిళసైనే.  ఎక్కువ మంది గవర్నర్లు 70–-79 ఏళ్ల మధ్య వయసువాళ్లే.

Latest Updates