పంచాయతీ సిబ్బందికి ఇన్సూరెన్స్

రైతు బీమా తరహాలో రూ.2 లక్షలు ఇచ్చేలా పథకం

గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి ప్రభుత్వ ఖర్చుతో లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల బీమా సొమ్ము అందేలా పథకం ఉంటుందని వివరించారు. ప్రస్తుతం రైతులకు ఇస్తున్న బీమా తరహాలో ఉంటుందన్నారు. దేశంలో పంచాయతీరాజ్ ఉద్యమానికి ఆద్యుడైన ఎస్‌‌కే డేకు నివాళిగా ఈ పథకానికి ఆయన పేరు పెడుతున్నట్లు చెప్పారు. 30 రోజుల యాక్షన్‌‌ ప్లాన్‌‌పై నిర్వహించిన సమావేశం గురువారం రాత్రి 9 గంటలకు ముగిసింది. భోజనం తర్వాత సమావేశంలో ముఖ్యమంత్రి పలు విషయాలు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంట్లో నరేగా నిధులతో సోక్ పిట్స్ నిర్మించాలని సీఎం ఆదేశించారు. సోక్ పిట్స్‌‌తో ఏ ఇంట్లోని వ్యర్థం, మురుగునీరు అక్కడే అంతర్థానమై, గ్రామంలో దోమలు, ఈగలు వ్యాపించకుండా ఉంటాయన్నారు.

జూన్, సెప్టెంబర్, జనవరిలో ‘పల్లె ప్రగతి’

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఏటా జూన్, సెప్టెంబర్, జనవరి నెలల్లో పది రోజుల చొప్పున నిర్వహించాలని సీఎం సూచించారు. పల్లె ప్రగతి మాదిరిగానే 20 రోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని, దీనికోసం మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంటిని, పరిసరాలను పచ్చగా, శుభ్రంగా ఉంచుకునేవారి ఇళ్లకు ఉత్తమ గృహం అవార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రామాల్లో బీఆర్‌ఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ అమలు సాధ్యాసాధ్యాలను మంత్రి ఎర్రబెల్లి కమిటీ పరిశీలించాలన్నారు.గ్రామ కంఠాన్ని ఖరారు చేయాలె వ్యవసాయ భూములు, రోడ్లపై వేలాడే తీగలను సరిచేయాలని విద్యుత్ అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ సరిహద్దులను నిర్ణయిస్తూ, గ్రామ కంఠాన్ని ఖరారుచేయాలని, గ్రామ రోడ్లను పంచాయతీ పేర రిజిస్టర్ చేయాలన్నారు. పట్టణ పాలనను పటిష్టపర్చేలా సెం టర్ ఆఫ్ అర్బన్ ఎక్స్ లెన్సీ ప్రారంభిం చాలని, గ్రామాల అభివృద్ధి కోసం విధానాల రూపకల్పన, అమలుకుస్టేట్ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ ను బలోపేతం చేయాలని సూచించారు.

Latest Updates