‘మద్యం లైసెన్స్‌‌’తో మస్తు పైసలు

   రికార్డు స్థాయిలో రూ.412.6 కోట్ల ఆదాయం

    ఇప్పటిదాకా 20,630 అప్లికేషన్లు

    మంగళవారమే 9,788..

    వరంగల్‌‌ డివిజన్​లో అత్యధికంగా 4,050

   లైసెన్స్‌‌ అప్లికేషన్లకు నేడే ఆఖరు

మద్యం దుకాణాల లైసెన్స్‌‌ కోసం అందుతున్న దరఖాస్తులు సర్కార్‌‌కు కాసుల పంట పండిస్తున్నాయి. అప్లికేషన్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం మస్తుగా వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో రూ.412.6 కోట్ల ఇన్​కమ్ వచ్చింది. 2017లో రూ.411 కోట్లు రాగా, ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది. రాష్ట్రంలో 2,216 మద్యం దుకాణాలకు ఇప్పటిదాకా మొత్తం 20,630 దరఖాస్తులు వచ్చినట్లు స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీ సోమేశ్ కుమార్‌‌ చెప్పారు. మంగళవారం ఒక్కరోజే భారీస్థాయిలో 9,788 అప్లికేషన్లు వచ్చాయని తెలిపారు. వరంగల్‌‌ డివిజన్‌‌లో 261 దుకాణాలు ఉండగా, అత్యధికంగా 4,050 అప్లికేషన్లతో రూ.81 కోట్ల ఆదాయం వచ్చింది. తక్కువగా సిటీ డివిజన్‌‌లో 173 షాపులు ఉండగా, 411 దరఖాస్తులతో 8.2 కోట్ల ఇన్‌‌కమ్‌‌ మాత్రమే సమకూరింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అనేక మంది కొత్తవారు ఉండగా, పెద్దసంఖ్యలో మహిళలుండటం గమనార్హం.

దరఖాస్తులకు నేడే ఆఖరు

డివిజన్ల వారీగా వచ్చిన అప్లికేషన్లు, ఆదాయం(రూ.కోట్లలో)

డివిజన్            దుకాణాలు      అప్లికేషన్లు         ఆదాయం

ఆదిలాబాద్‌‌           163             1,108             22.16

కరీంనగర్‌‌              266             1,587             31.74

ఖమ్మం                165             3,469             69.38

మహబూబ్‌‌నగర్‌‌     164             1,276             25.52

మెదక్‌‌                  193             1,226             24.52

నల్లగొండ               278             3,809             76.18

నిజామాబాద్‌‌         131              523               10.46

రంగారెడ్డి               422             3,169             62.38

వరంగల్‌‌                261             4,050                81

హైదరాబాద్‌‌           173              411                8.22

మొత్తం   2,216     20,630   412.6

Latest Updates