తెలంగాణ‌లో మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేత

మ‌ద్యం దుకాణాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ఆంక్ష‌ల్ని పూర్తిగా ఎత్తేసింది. రాత్రి 9:30 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం షాపుల‌ను తెరిచేందుకు అనుమ‌తిచ్చింది.

కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌భుత్వం లాక్ డౌన్ ప్ర‌క‌టించింది. లాక్ డౌన్ మ‌ద్యం అమ్మ‌కాల్ని పూర్తిగా నిషేదించింది. అయితే ఆ నిబంధ‌న‌ల్ని తొల‌గించిన‌ ప్ర‌భుత్వం మే 6 నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులకు అనుమతిచ్చింది. ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. మరోసారి ఆబ్కారీ శాఖ కొత్తగా ఉత్తర్వులు జారీ చేస్తూ.. రాత్రి 9:30 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతిచ్చింది. మద్యం దుకాణాలపై ఉన్న ఆంక్షలను ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం విక్రయాలు జ‌రుపుకోవ‌చ్చ‌ని మద్యం దుకాణాలపై ఆంక్షలు ఎత్తివేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Latest Updates