లాక్ డౌన్ తరువాతే పదో తరగతి పరీక్షలు: హైకోర్ట్

లాక్ డౌన్ తరువాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలంటూ హైకోర్ట్ తీర్పిచ్చింది. కరోన వైరస్ కారణంగా టెన్త్ పరీక్షలు నిలిపి వెయ్యాలంటూ కోర్ట్ లో పిల్ దాఖలైంది. పరీక్షల నిర్వహణపై దాఖలైన పిల్ పై అత్యవసర విచారణ చెయ్యాలని అడ్వకేట్  జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ లో కోర్టు ను కోరారు. దీంతో  పిల్ పై హైకోర్ట్ అత్యవసర విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా లాక్ డౌన్ అనంతరం అంటే జూన్ 8 తర్వాత పరీక్షలు నిర్వహించుకోవాలని కోర్ట్ ఆదేశించింది.  అంతకంటే ముందు రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించడానికి ఉన్న పరిస్థితులపై జూన్ 4 న పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది.

for more news

మాస్క్ ధరించకపోతే వెయ్యి ఫైన్..హెచ్చరించిన సీఎం కేసీఆర్

ఏపీ తో కలిసే ఉంటాం..అలా అని రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం 

కేంద్రం ప్రకటించిన ఆర్ధిక ప్యాకేజి ఒక డొల్ల


Latest Updates