1,520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్

1,520 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్


నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 1,520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు ట్వీట్ చేశారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో పోస్టులు ఉంటాయని.. అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.  

తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) రిక్రూట్‌మెంట్ ఈ ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తుంది.  ఆగస్టు 25 ఉదయం 10.35 గంటల నుంచి సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వివరాల కోసం https://mhsrb.telangana.gov.in వెబ్ సైట్ క్లిక్ చేయవచ్చు. అనుభవాన్ని బట్టి, అభ్యర్థుల వేతనం రూ., 31,040 నుంచి రూ. 92,050 వరకు ఉంటుంది. పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.