రాష్ట్రంలో కొత్త‌గా 56 పాజిటివ్ కేసులు. 26 కేసులు సూర్యాపేట‌లోనే

తెలంగాణలో కరోనా సోకిన వారి సంఖ్య 928కి చేరింది. మంగ‌ళ‌వారం కొత్తగా రాష్ట్రంలో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 26 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని మరో 19 మంది కరోనా బారినపడడ్డారు. నిజామాబాద్‌లో 3, గద్వాలలో 2, ఆదిలాబాద్‌లో 2, ఖమ్మం, మేడ్చల్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.  ప్రస్తుతం తెలంగాణలో 711 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇవాళ కరోనా నుంచి కోలుకొని 8 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు మొత్తం 194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో క‌రోనా బారిన ప‌డి ఇప్పటి వరకు 23 మంది మరణించారు.

సూర్యాపేట జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య మంగ‌ళ‌వారంతో 80కి చేరింద‌ని, ఇప్పటివరకు సేకరించిన 796 నమూనాల్లో ఇంకా 191 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉందని జిల్లా వైద్య అధికారి (డీఎం అండ్ హెచ్‌వో) వెల్లడించారు.

Latest Updates