ఇంటర్ ఫలితాలపై పూర్తి వివరాలు సమర్పించండి: హైకోర్టు

ఈనెల 15న ఇంటర్ ఫలితాలపై పూర్తి వివరాలు సమర్పించాలని బోర్డును ఆదేశించింది హైకోర్టు. ఫెయిలైన 3లక్షల 28 వేల మంది విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ప్రకటించాలని ఆదేశించింది. ఇంటర్ ఫలితాల గందరగోళంపై దాఖలైన పిటీషన్ ను కోర్టు ఇవాళ విచారించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని కోర్టుకు తెలిపింది బోర్డ్. పూర్తి వివరాలు సమర్పించేందుకు మరో వారం గడువు కోరింది బోర్డు. దీంతో తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది హైకోర్టు.

Latest Updates