డ్రోన్ల కేసులో నిందితులపై చర్యలు వద్దు

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: డ్రోన్ల వినియోగం కేసులో నిందితులపై ఏవిధమైన చర్యలు తీసుకోవద్దని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. వీఐపీ ఇంటిపై డ్రోన్‌ కెమెరా ప్రయోగించారనే కేసులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఆయన సోదరుడు క్రిష్టారెడ్డి, పి.విజయ్‌పాల్‌రెడ్డి అదే కేసులో రెండో, నాలుగో నిందితులుగా ఉన్నారు. తమపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టేయాలని వీరిద్దరూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌లో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫస్ట్‌ నిందితుడు రేవంత్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగనుంది.

Latest Updates