తెలంగాణ కోర్టులకు సెప్టెంబర్‌ 5 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

రాష్ట్ర హైకోర్టు కీల‌క నిర్ణ‌యం

క‌రోనా వైర‌స్ విస్తృతంగా వ్యాపిస్తున్న నేప‌థ్యంలో తెలంగాణ హైకోర్టు కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్‌లకు లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ 5 వరకు పొడిగిస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. అత్యవసర కేసులు విచారణను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌తో పాటు నేరుగా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని హైకోర్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా… ఇతర జిల్లాలలోని కోర్టుల్లో నేరుగా పిటిషన్లు దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. కోర్టుల వద్ద శానిటైజేషన్, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.

 

Latest Updates