ప్రాణాలు పోతున్నాపట్టదా?.డెంగీ నివారణపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో డెంగ్యూ నివారణ చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టు. మనుషులు చనిపోతున్నా.. స్పందించడం లేదని అసహనానికి గురైంది. డెంగ్యూపై ప్రజల్లో అవగాహన కల్పించడం లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఉదయం హైకోర్టుకు హాజరు కావాలని ఉన్నతాధికారులను ఆదేశించింది హైకోర్టు. సీఎస్ తోపాటు వైద్యారోగ్య, మున్సిపల్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్లను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.

Latest Updates