ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

క‌రోనా నేప‌థ్యంలో లాక్ డౌన్ విధించ‌డంతో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియకు బ్రేక్ ప‌డింది. అయితే తాజాగా ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లాక్ డౌన్ లో ఇంటర్ మూల్యాంకనంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజిక కార్యకర్త ఓం ప్రకాష్ దాఖ‌లు చేసిన‌ పిల్ ను అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు.. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. జూన్ రెండో వారంలో ఇంట‌ర్ ఫ‌లితాలు వచ్చే అవ‌కాశ‌ముంది.

telangana High court green signal for intermediate paper valuation

Latest Updates