జనగామ ఎమ్మెల్యే, ఆర్డీవో, ఈవోలకు హైకోర్టు నోటీసులు

Telangana high court issued notices to jangaon mla, rdo, eo

ఈనెల 26న కోర్టుకు హాజరు కావాలని ఆదేశం

జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల అవకతవకలకు సంబంధించిన కేసులో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని కోర్టుకు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యాదగిరిరెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హైకోర్టులో కేసు వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 26న ఎమ్మెల్యే స్వయంగా లేదా ఎమ్మెల్యే తరఫున న్యాయవాది గాని కోర్టుకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయమై జనగామ ఆర్డీవో మధుమోహన్‌‌‌‌ను వివరణ కోరగా దీనికి సంబంధించి తనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి, తెలంగాణ చీఫ్ ఎలక్ర్టోలర్ ఆఫీసర్, ఎలక్షన్​ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారులకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది నిజమేనన్నారు.

Latest Updates