గూగుల్ సంస్థ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

telangana-high-court-notices-to-google-company

ఫేమస్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సంస్థపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోని కొన్ని  వెబ్ సైట్లు అశ్లీలంగా ఉన్నాయంటూ ఓ యువతి ఫిర్యాదు మేరకు హైకోర్టు గూగుల్ సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఫేస్ బుక్ లో ఉన్నవారి పేర్లను, ఫోటోలను తీసుకొని కొందరు పోర్న్ వెబ్ సైట్ల లో పెడుతున్నారని ఓ యువతి హైకోర్టు ను ఆశ్రయించింది. తన పేరు,ఫోటోలను కూడా ఓ పోర్న్ వెబ్ సైట్ లో ఉంచారని, ఆ వెబ్ సైట్  నుంచి తన వివరాలను తొలగించాలని గతంలో గూగుల్ సంస్థ కు కూడా ఫిర్యాదు చేసినట్టు ఆ యువతి కోర్టుకు తెలిపింది. గూగుల్ సంస్థ పట్టించుకోకపోవడంతో హైకోర్టు ను ఆశ్రయించినట్టు ఆ యువతి పేర్కొంది.

దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అశ్లీల వెబ్ సైట్లు సృష్టిస్తున్న వారి పట్ల గూగుల్ సంస్థ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. అలాంటి వెబ్ సైట్ లు నిర్వహిస్తోన్న వారి పూర్తి వివరాలు తెలియజేయాలని హైకోర్టు గూగుల్ సంస్థ కు ఆదేశాలు జారీ చేసింది.తదుపరి విచారణను సెప్టెంబర్1 కి వాయిదా వేసింది.

Latest Updates