రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై నమోదైన మూడు పిటీషన్లపై హైకోర్ట్ విచారణ చేపట్టింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ తీర్పిచ్చింది.

అనుమతులు లేకుండా మంత్రి కేటీఆర్ ఫామ్ హౌజ్ లో డ్రోన్ కెమెరా ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. మూడు కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రేవంత్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు.

కానిస్టేబుల్ తో ఎలా పిటిషన్ వేయిస్తారు..?

రేవంత్ తరుపున ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్  న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ హైకోర్ట్ లో తన వాదనల్ని వినిపించారు. గతంలో ఉన్నటువంటి కేసుల్ని కేస్ స్టడీస్ ను  ఉదహరిస్తూ రిమాండ్ చేయాల్సిన అవసరం లేదంటూ వాదించారు. ఒక సీనియర్ అధికారితో కాకుండా కానిస్టేబుల్ ర్యాంక్ వ్యక్తితో కంప్లెయింట్ నమోదు చేయిస్తారా అని వాదించారు. దాన్ని ఎఫ్ఐఆర్ చేసిన తరువాత సమగ్ర దర్యాప్తు చేయకుండానే.. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ విధించారని తెలిపారు.

రూల్స్ ఫాలో అయ్యాం : ప్రభుత్వం తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్

ప్రభుత్వం తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్ రెడ్డి తన వాదనల్ని వినిపించారు. అన్నీ రూల్స్ ఫాలో అవుతూనే కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇరుపక్షాల వాదనల్ని విన్న కోర్ట్ విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Latest Updates