ఏపాటి సాయం తీసుకున్నరు? సర్కారుకు హైకోర్టు ప్రశ్న

    స్వైన్​ఫ్లూ, డెంగీ నియంత్రణలో ప్రైవేట్​ ఆస్పత్రుల భాగస్వామ్యంపై సర్కారుకు హైకోర్టు ప్రశ్న

హైదరాబాద్​, వెలుగు: స్వైన్​ఫ్లూ, డెంగీ వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రైవేట్​ ఆస్పత్రుల నుంచి ప్రభుత్వం ఏ మేరకు సాయం తీసుకుందో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ కరుణ వేసిన పిల్​తో పాటు, లాయర్​ రాపోల్​ భాస్కర్​ రాసిన లేఖను పిల్​గా స్వీకరించి హైకోర్టు విచారించింది. ఆ వ్యాధుల నివారణ, నియంత్రణకు ప్రైవేటు హాస్పిటల్స్​ను ఏ మేరకు భాగస్వాము లను చేసిందో చెబుతూ కౌంటర్​ వేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని చీఫ్​ జస్టిస్​ ఆర్​.ఎస్​. చౌహాన్​, జస్టిస్​ అభిషేక్​రెడ్డిల కూడిన డివిజన్​ బెంచ్​ ఆదేశించింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

 

 

Latest Updates