100 కోట్లతో అమరుల భవనం

telangana-immortal-building-in-hyderabad

అమరవీరులను స్మరించుకునే విధంగా అంతర్జాతీయ స్థాయిలో స్మారక భవనాన్ని నిర్మిస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 3.29 ఎకరాల  స్ధలంలో 2లక్షల95వేల చదరపు అడుగులలో  రూ.100 కోట్లతో నిర్మిస్తున్న ఈ భవనాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. మంగళవారం  నిర్మాణ పనులు జరుగుతున్న అమరవీరుల స్మారక భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. హైదరాబాద్ కు వచ్చే ప్రతి ఒక్కరు దీనిని చూసేలా నిర్మిస్తున్నామని, ఈ భవనంలో మ్యూజియం, ఫోటో గ్యాలరీ, కన్వేన్షన్ హాల్ , రెస్టారెంట్ , వెయ్యి వాహనాలు నిలిపేలా పార్కింగ్ , 130 అడుగుల ఎత్తుతో ఆరని జ్యోతి స్తూపాన్ని  కడుతున్నట్లు మంత్రి తెలిపారు.

Latest Updates