టాప్‌-10 పోలీస్‌స్టేషన్ల లిస్టులో తెలంగాణ

సమర్ధంగా పనిచేసే టాప్‌-10 పోలీస్‌స్టేషన్ల లిస్టును ప్రకటించింది కేంద్ర హోంశాఖ. ఈ లిస్టులో రాష్ట్రంలోని కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ ఈ జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని అబెర్‌దీన్‌ పోలీస్‌స్టేషన్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఆస్తి తగాదాలు, మహిళలు.. అణగారిన వర్గాలపై నేరాల సంఖ్య ఆధారంగా ఈ లిస్టును ప్రకటించింది. రెండో స్థానంలో గుజరాత్ లోని బాలా సినోర్‌, మూడోస్థానంలో మధ్యప్రదేశ్‌ లోని అజిక్‌ బుర్హాన్‌పూర్‌, నాలుగో స్థానంలో తమిళనాడు లోని ఏడబ్ల్యూపీఎస్‌ థేని, ఐదో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్‌ లోని అనిని, ఆరో స్థానంలో ఢిల్లీలోని ద్వారక,  ఏడో స్థానంలో రాజస్థాన్లోని  బకాని,  తొమ్మిదో ప్లేస్ లో గోవాలోని బిచోలిమ్‌, పదో స్థానంలో మధ్యప్రదేశ్ లోని  బార్‌గావా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.

Latest Updates