ఇవాల ఇంటర్ రిజల్ట్స్

  • విడుదల చేయనున్న మంత్రి సబితారెడ్డి

ఇంటర్ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఇంటర్‌‌ కమిషనరేట్‌‌లో మధ్యాహ్నం 3 గంటలకు విద్యా శాఖ, ఇంటర్‌‌బోర్డు అధికారులతో కలసి మంత్రి సబితారెడ్డి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫస్టియర్‌‌, సెకండియర్‌‌ ఫలితాలు రెండూ ఒకేసారి రిలీజ్‌‌అవుతున్నా యి. ఇంటర్ బోర్డువెబ్‌‌సైట్‌‌ https://tsbie. cgg.gov.in/ తో పాటు www.v6velugu. com, ఇతర వెబ్‌‌సైట్లలో ఫలితాలను తెలుసు కోవచ్చు.

వాల్యుయేషన్‌‌ త్వరగా పూర్తవడంతో..

స్టేట్‌‌ లో మార్చి 4 నుంచి 18 వరకు ఇంటర్‌‌ పరీక్షలు జరిగాయి. 9.65 లక్షల మంది స్టూడెంట్లు హాజరయ్యారు. కరోనా లాక్‌‌డౌన్‌‌తో జాగ్రఫీ, మోడర్న్ లాంగ్వేజ్‌ ‌ఒకేషనల్ ఎగ్జామ్స్ ‌వాయిదా పడగా వాటిని ఈ నెల 3న నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జాగ్రత్తలు తీసుకొని మే 12 నుంచి 30 వరకు వాల్యుయేషన్‌‌ చేశారు. జూన్ రెండో వారంలో సెకండియర్ ఫలితాలు విడుదల చేసి వారం తర్వాత ఫస్టియర్ రిజల్ట్స్ ఇవ్వాలని తొలుత అనుకున్నా వాల్యువేషన్ పూర్తవడంతో రెండు రిజల్ట్స్‌ ను ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. కాగా, గతేడాది ఇంటర్ రిజల్ట్ గందరగోళంతో రిజల్ట్  ప్రాసెస్ నుంచి గ్లోబరీనా సంస్థను తప్పించి సీజీజీకి అప్పగించారు. రిజల్ట్ ‌లో తప్పులుండకుండా అధికారులు చెక్ చేశారు.

Latest Updates