ఫెయిల్ అయ్యా.. నాకు రిటైర్మెంట్​ ఇవ్వండి

  • పోలీస్ సిస్టమ్​ను మార్చలేకపోయా
  • రిఫార్మ్స్​ తేవడంలో ఫెయిల్ అయ్యా
  • కేంద్ర హోం శాఖకు ఐపీఎస్ వీకే సింగ్ లెటర్
  • రాష్ట్ర ప్రభుత్వం తనను పట్టించుకోలేదని కామెంట్

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్ మెంట్‌లో సంచలనాలకు మారుపేరైన సీనియర్ ఐపీఎస్‌ వీకే సింగ్‌ తనకు వాలంటరీ రిటైర్మెంట్‌ ఇవ్వాలంటూ నోటీస్‌ ఇచ్చారు. అక్టోబర్‌‌ 2న వాలంటరీ‌ రిటైర్‌ మెంట్‌ ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సెక్రటరీకి బుధవారం ఆయన లెటర్‌‌ రాశారు. రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్‌ మెంట్‌ సిస్టమ్‌ను చేంజ్‌ చేయడంలో ఫెయిల్‌ అయ్యానని లెటర్‌‌లో పేర్కొన్నారు. 1987 బ్యాచ్‌ ఆర్ఆర్‌‌ కు చెందిన వినయ్‌ కుమార్‌‌ సింగ్‌ ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు. వాలంటరీ‌ రిటైర్మెంట్‌ ఇవ్వాలని మూడు నెలల ముందుగా రిటైర్మెంట్‌ నోటీసులు ఇచ్చారు.

వీకే సింగ్ లేఖలో ఏముందంటే..

‘‘నేను 1987 ఆర్ఆర్, ఐపీఎస్‌ బ్యాచ్‌లో తెలంగాణ క్యాడర్‌‌ అధికారిని. పోలీస్‌ వ్యవస్థలో సమూల మార్పులు తేవాలనే ఆశయంతో డిపార్ట్‌మెంట్‌లో చేరాను. కానీ ఆశయాలు సాధించడంలో ఫెయిల్ అయ్యాను. రాష్ట్ర ప్రభుత్వం నా సేవలను పెద్దగా వాడుకోలేదు. ప్రభుత్వంలో పోలీస్ సేవలను మెరుగుపరచడానికి నేను చేసిన సూచనలు పట్టించుకోలేదు. బహుశా నా అభిప్రాయం విలువైంది కాదని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదేమో. అవసరమైతే రిటైర్మెంట్‌ తరువాత ప్రభుత్వం నా సేవలను వాడుకుంటుందని భావిస్తున్నా. కొత్త పంథాలో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. అందుకోసమే న్యాయానికి, సత్యానికి ప్రతీకైన గాంధీ పుట్టినరోజున రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. నేను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి థ్యాంక్స్‌. ఎవరైనా ప్రభుత్వంలో చేరాలనుకుంటే పోలీసుల్లో మాత్రమే చేరండి’’ అని సింగ్ తన లేఖలో రాశారు.

డీజీపీగా నియమించనందుకే..?

సింగ్‌ పేరుతో విడుదలైన లెటర్‌‌పై ఆయన సిగ్నేచర్‌‌ లేదు. దీంతో బుధవారం తేదీతో బయటకు వచ్చిన రిటైర్మెంట్‌ నోటీస్‌ కేంద్ర హోంశాఖకు చేరిందో లేదో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌తో పాటు పోలీస్‌ అకాడమీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే రాష్ట్రంలోని ఐపీఎస్‌లలో సీనియర్‌‌ అయిన తనకు డీజీపీ పదవికి అర్హతలు ఉన్నాయని సింగ్ ఇదివరకే చెప్పారు. తనను డీజీపీగా నియమించకపోతే రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు.

Latest Updates