అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శం

హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దినోత్సవంతో పాటు.. గవర్నర్ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా.. రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..  అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శమన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో తెలంగాణ దేశానికి దిక్సూచిలా మారుతుందన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాజ్ భవన్ పరిసరాల్లో పండ్ల మొక్కలను నాటిన గవర్నర్..గోశాలను ప్రారంభించారు. ఆ తర్వాత.. ఛాన్సలర్స్ కనెక్ట్ లో విన్నర్లకు అవార్డులు అందించారు.

Latest Updates