ఎస్మాపై గత జీవోలు తెలంగాణలో చెల్లవు : హైకోర్టు

హైదరాబాద్ : ఆర్టీసీ సమస్యను తొందరగా పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ రాపోలు ఆనంద భాస్కర్ వేసిన పిటిషన్ పై విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు 27మంది కార్మికుల ప్రాణాలు పోయాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్. హైపవర్ కమిటీ వేసి ఈ సమస్యను పరిష్కరించాలని పిటిషన్ కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఇల్లీగల్ అని చెప్పారు. ఇల్లీగల్ అని ఎలా చెబుతారని కోర్టు ప్రశ్నిచింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలులేవు అనే మాటలు ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. టీఎస్ ఆర్టీసీ విడిపోయినప్పటికీ ఇంకా వాట తేలలేదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.

దీంతో.. గతంలో ప్రభుత్వం జారీచేసిన జీవోలను ప్రస్తావించారు ఏజీ. ఎస్మాపై 2015లో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9ని ప్రస్తావించారు. ఆరు నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు జీవో పొడిగిస్తారని చెప్పారు. 1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన జీవో నంబర్ 180ని ప్రస్తావించారు ఏజీ. ఐతే… 1998లో తీసుకొచ్చిన జీవో తెలంగాణకు వర్తించదని హైకోర్టు తెలిపింది. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 68 ప్రకారం..  పబ్లిక్ యుటిలిటీ సర్వీసులు ఎస్మా పరిధిలోకి వస్తాయని ఏజీ తెలిపారు.

Latest Updates