యూత్ లో తెలంగాణ దేశంలోనే ఫస్ట్

మూడింట రెండొంతుల జనాభా యువత, మధ్య వయస్కులే

హైదరాబాద్, వెలుగు: మనది యువ తెలంగాణ. మన రాష్ట్రంలో యువ జనాభానే ఎక్కువగా ఉంది. పని చేయగలిగే సత్తువ కలిగిన ఏజ్ గ్రూపోళ్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా దేశంలోనే ఫస్ట్ప్లేస్ లో నిలిచింది. రాష్ట్రంలో 15 నుంచి 59 ఏండ్లలోపు వాళ్లే 71.1 శాతం మంది ఉన్నారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన శాంపిల్ రిజస్ట్రే షన్ సిస్టం స్టా టికల్ రిపోర్టులో ఈ విషయం వెల్లడైం ది. రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది యువత, మధ్యవయ స్కులే కావడం విశేషం. దీన్ని బట్టి రాష్ట్రంలోని 3.52 కోట్లజనాభాలో 2.52 కోట్లమంది ఇదే ఏజ్ గ్రూప్లో ఉన్నట్లు తెలుస్తోంది. మన రాష్ట్రం తర్వాత స్థానాల్లో ఏపీ (70.8 %), ఢిల్లీ( 69.9 %), జమ్మూకాశ్మీర్ ( 69.7%), పంజాబ్ (69.3%) నిలిచాయి. ఇక ఈ ఏజ్ గ్రూప్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (59.6 %) ఆఖరులో ఉంది. వృద్ధు లు 8 శాతమే… రాష్ట్ర జనాభాలో ప్రతి 100 మందిలో14 ఏండ్లలోపు పిల్లలు 20.08 శాతం మంది ఉండగా, 60 ఏండ్లకు పైబడిన వృద్ధులు 8.1 శాతం మంది మాత్రమే ఉన్నారు. అర్బన్, రూరల్ ఏరియాల్లో చిన్నారులు, వృద్ధుల శాతం సుమారు ఇదే రేషియోలో ఉంది. 15 నుంచి 59 ఏండ్లఏజ్ గ్రూప్ ఉన్నోళ్లురూరల్ ఏరియా జనాభాలో 70.6 శాతం, అర్బన్లో71.9 శాతం ఉన్న ట్లు రిపోర్టులో వెల్లడైం ది. వీరిలో పురుషులు 70.08 శాతం, స్ర్తీలు 71.4 శాతం ఉన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం పని చేయగలిగే జనాభా అటు దేశంలో, ఇటు రాష్ట్రం లో అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, వారందరికీ సరిపడా పని మాత్రం దొరకడం లేదు. దేశంలో, రాష్ట్రంలోనూ నిరుద్యోగం ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగి స్తోంది. లాక్ డౌన్ తర్వాత ఇది మరింత పెరిగింది. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ దేశంలో సగం మంది ఏ పనీ లేకుండా ఉంటున్నట్లు గతంలో నిర్వహించిన నేషనల్ శాంపి ల్ సర్వే నివేదికలో వె ల్లడైం ది. 2011–12 లో ఈ ఏజ్ గ్రూప్ వాళ్లు55.9 శాతం మంది ఏదో ఒక పనిలో ఉండగా, అది 49.8 శాతానికి పడిపోయినట్లు 2017–18లో ఎంప్లాయ్ మెంట్ పై కేంద్రం నిర్వహించిన సర్వేలో తేలింది.

Latest Updates