రైతులను ముందుకు నడిపించే ఏకైక రాష్ట్రం తెలంగాణ

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో రైతు వేదిక కార్యక్రమానికి హాజరై భూమి పూజ చేసి, మొక్కలు నాటారు మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. ఈ సంద‌ర్భంగా మాట్లాడారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో మొదటి రైతు వేదిక ప్ర‌జ‌ల‌ మధ్య చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లా అనేది తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరి పోసిందని..ఇక్కడి ఉద్యమమే తెలంగాణ అభివృద్ధికి అడుగులు వేసేందుకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రనికే కరీంనగర్ రైతు వేదికలు అనేవి సమావేశాల మందిరాలకు కాకుండా 60 లక్షల పై బడి రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా రైతులను ముందుకు నడిపించే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమ‌ని కేసీఆర్ ఆలోచనతో ప్రాజెక్ట్ లన్ని అమల్లోకి వస్తే, తెలంగాణలో కోటి డెబ్బై లక్షల ఎకరాలు సాగుకు అందుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆహార పదార్థాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యవసాయ విశ్లేషణ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. రైతు వేదిక ద్వారా రాష్ట్రంలో ఉండే పంటవిశ్లేషణ తెలుస్తుందన్నారు. పంటలకు అవసరమైన ఎరువులు సరైన విధంగా వేసేందుకే ఈ రైతు వేదిక కార్యక్రమం చేపట్టామని తెలిపారు. వ్యవసాయ విశ్లేషణ చేయడానికే రైతు వేదిక ఉపయోగ పడుతుందనీ..సాగు చేసే పంటలపై శిక్షణ ఇచ్చేదే రైతు వేదిక అన్నారు.

400,1000 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి సేకరిస్తున్నామని తెలిపారు. పంటలన్నింటిని దేశంలో ఐదు రాష్ట్రాలు మాత్రమే అన్ని రకాల పంటలకు పండించే సాగు భూమి ఉందని తెలిపారు. దేశంలోనే మన రాష్ట్రం వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని .. కరోనా మహమ్మారి కష్ట కాలంలో కూడా రైతులను కాపాడేందుకు ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించి, వారం రోజుల్లో డబ్బులు పడ్డాయని తెలిపారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates