బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నరాష్ట్రం తెలంగాణ: కేసీఆర్‌

బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరుగుతున్న చర్చలో సీఎం మాట్లాడారు. అన్ని రంగాల్లో రాష్ట్రం దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రంలో రైతులు మంచిగా పంటలు పండిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. పేదల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదన్నారు. ప్రస్తుతం పెన్షన్‌ను వందశాతం పెంచి రూ.2,016 చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.200 పెన్షన్‌ ఇచ్చేవారన్నారు.  ప్రాజెక్టులకు డీపీఆర్‌ కావాలని విపక్షాలు అడుగుతున్నాయని… ప్రాజెక్టులకు బహిరంగంగా టెండర్లు పిలుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తామని ప్రశ్నించారు.

అంతేకాదు మైనస్‌లో ఉన్న అనేక రంగాల్ని ప్లస్‌లోకి తెచ్చామన్నారు సీఎం కేసీఆర్. అప్పుల్లో ఉన్న విజయా డైరీని లాభాల్లోకి తెచ్చామని గుర్తు చేశారు. కంది రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు. కందుల కొనుగోలుకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసిందన్నారు. కనీస మద్దతు ధర కేంద్రం చేతుల్లో ఉందన్నారు కేసీఆర్.

Latest Updates