పీజీ మెడికల్ సీట్ల ఫీజుల పెంపుపై జూడాల ఆందోళన

హైదరాబాద్:  పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేప‌ట్టారు జూనియ‌ర్ డాక్ట‌ర్లు. ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యాన్ని ఉపసంహరించుకోవాలని కోఠి మెడికల్ కళాశాలలో ఆందోళన చేపట్టారు

ప్ర‌భుత్వం కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక…. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా..  ఫీజులు పెంచింద‌ని జూడాలు ఆరోపించారు. 2017 లో పెంచిన ఫీజుల‌పై కోర్టు నుంచి పూర్తి జడ్జిమెంట్ రాక ముందే , ఫీజులు ఎలా పెంచుతారంటూ ప్ర‌శ్నించారు. తక్షణమే జీఓ 28 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా తో పోరాడే వైద్యులు… ఇప్పుడు ఈ ఫీజు పెంపు తో పోరాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిల‌దీశారు.

మెడికల్‌ పీజీ సీటు ఫీజును రూ.6.90 లక్షలకు పెంచుతూ 2017లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా ఈ ఫీజుల పెంపుపై హెల్త్‌ రిఫార్మర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌, జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లాయి. దాంతో అప్పుడు ఫీజుల పెంపును తాత్కాలికంగా నిలిపివేసారు. మ‌ళ్లీ రెండు రోజుల క్రితం .. ఆయా కాలేజీల ప్రకారం కన్వీనర్‌ కోటా సీటు ఫీజును రూ.7 లక్షల నుంచి రూ.7.75 లక్షలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జూనియ‌ర్ డాక్ట‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టారు.

Latest Updates