కండక్టర్ తో గొడవ : కబడ్డీ ప్లేయర్స్ అరెస్ట్

చెన్నై : తమిళనాడులో తెలంగాణ  కబడ్డీ ఆటగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చెరిలో జరిగిన కబడ్డీ పోటీలకు గతవారం రాష్ట్రానికి చెందిన  59 మంది ఆటగాళ్లు వెళ్లారు. నిన్నటితో  పోటీలు ముగియడంతో  తిరుగు  ప్రయాణమయ్యారు. ఐతే పుదుచ్చేరిలో బస్సు ఎక్కిన ఆటగాళ్లు టికెట్ విషయంలో కండక్టర్ తో  గోడవకు దిగారు. దీంతో  ఆగ్రహం వ్యక్తం  చేసిన ప్రయాణికులు ప్లేయర్లపై దాడికి దిగారు. ఈ దాడిలో కబడ్డీ టీమ్ కోచ్ లక్ష్మణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి  చేరుకున్న ఎగ్మూర్  పోలీసులు ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.

Latest Updates