నిరుద్యోగులకు​ డీట్​

నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఇక రెజ్యూమ్​ పట్టుకొని ప్రతి కంపెనీకి తిరగాల్సిన పనిలేదు. సులభంగా జాబ్​లు పొందేందుకు రాష్ర్ట ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ​ఎక్సేంజ్​ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ–డీట్​) యాప్​, వెబ్​సైట్​ను ఆవిష్కరించింది. దీని ద్వారా టెన్త్​, ఆపైన విద్యార్హత కలిగిన వారికి అన్ని రకాల ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ కోరుకున్న జాబ్స్​ పొందేందుకు సహకరిస్తారు. ఇందుకు మీరు చేయాల్సింది యాప్​ / వెబ్​సైట్​లో మీ ప్రొఫైల్​ క్రియేట్​ చేసుకోవడమే.

డీట్​ యాప్​లో సర్వీస్​ పూర్తి ఉచితం. ప్లే స్టోర్​ నుంచి మొబైల్​ యాప్​ ను డౌన్​లోడ్​ చేసుకొని అకౌంట్​ క్రియేట్​ చేసుకోవాలి. పేరు, ఈమెయిల్​, కాంటాక్ట్​ నంబర్‌‌తో పాటు క్వాలిఫికేషన్స్​, స్కిల్స్​, వర్క్​ ఎక్స్​పీరియన్స్ వంటి వివరాలు నమోదు చేసి మీ ప్రొఫైల్​ క్రియేట్​ చేసుకోవాలి. అభ్యర్థి సమాచారం రిక్రూటర్లకు కన్పించదు కానీ నిర్వహకులు సార్ట్​అవుట్​ చేసి ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలకు మీ డేటా పంపుతారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్​ యూజర్లకు మాత్రమే యాప్​ అందుబాటులో ఉంది.

ఎలా పని చేస్తుంది?

ఆఫ్​‌‌లైన్‌లో ఎంప్లాయ్​మెంట్ ఎక్సేంజ్​ తరహాలో ఇది పనిచేస్తుంది. అభ్యర్థి క్వాలిఫికేషన్స్​, స్కిల్స్​, ఎక్స్​పీరియన్స్​, అదర్​ యాక్టివిటీస్​ వంటి పూర్తి సమాచారం ఈ యాప్​/వెబ్​సైట్​లో నమోదు చేస్తే చాలు. మీకు సూటయ్యే జాబులు వాళ్లే వెతికి పెడతారు. అభ్యర్థుల అప్లికేషన్లు పరిశీలించి అవసరమైన కంపెనీలకు పంపితే ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు, టెస్ట్​లు నిర్వహించి నేరుగా అభ్యర్థులను రిక్రూట్​ చేసుకుంటాయి. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 45 వేల కంపెనీల వివరాలు, 42 వేల జాబ్​ల సమాచారం నమోదు చేశారు. వీటికి సంబంధించిన అలర్ట్స్​ ఎప్పటికప్పుడు మీ మొబైల్​ కే వస్తాయి.

వెబ్​సైట్​: www.tsdeet.com.